logo
logo
Sign in

WV Raman Writes To Sourav Ganguly, Rahul Dravid, Mentions Star Culture In Women's Cricket Team

avatar
seosmsakshi
WV Raman Writes To Sourav Ganguly, Rahul Dravid, Mentions Star Culture In Women's Cricket Team

డబ్ల్యూవీ రామన్‌ సంచలన వ్యాఖ్యలు.. టార్గెట్‌ తనేనా!

ఢిల్లీ: టీమిండియా ఉమెన్స్‌ క్రికెట్‌ మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌.. మహిళల జట్టులోనూ స్టార్‌ క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ గత గురువారం రామన్‌ స్థానంలో రమేశ్‌ పొవార్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్‌లో స్టార్‌ కల్చర్‌ పెరిగిపోయిందంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 

''ఉమెన్స్ టీమ్‌లో కొంత మంది క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది. జట్టుకి మించి ఎవరూ ఎక్కువ కాకూడదనేది నా ఉద్ధేశం. ఇప్పటికైనా టీమ్‌లో స్టార్ కల్చర్‌కి స్వస్తి పలకాలని కోరుతున్నా. ఈ క్రమంలో జట్టుని మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైతే  రోడ్ మ్యాప్‌ని కూడా సిద్ధం చేస్తానంటూ'' వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే  రామన్ ఫిర్యాదు పరోక్షంగా మిథాలీ రాజ్‌పైనే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  


చదవండి: ఆమె బాధలో ఉంది.. బీసీసీఐ పట్టించుకోకపోవడం దారుణం

రమేశ్‌ పొవార్‌కు బీసీసీఐ బంపర్‌ ఆఫర్‌.. రెండోసారి

 
 
 
Read latest Sports News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram
collect
0
avatar
seosmsakshi
guide
Zupyak is the world’s largest content marketing community, with over 400 000 members and 3 million articles. Explore and get your content discovered.
Read more